May 22, 2026
Explore
ప్రేమోన్మాదికి ఉరి శిక్ష

ప్రేమోన్మాదికి ఉరి శిక్ష

May 22, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

పెళ్లికి యువతి తల్లి,తండ్రి నో చెప్పడం తో… అతి కిరాతకంగా ఆమె తల్లిదండ్రులను చంపిన ప్రేమోన్మాదికి ఉరి శిక్ష వేసిన కోర్టు జడ్జి.పెళ్లికి నిరాకరించారని యువతి తల్లిదండ్రులను హతమార్చిన కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
వరంగల్(D) చెన్నరావుపేట(M) 16 చింతల తండాలో 2024 జూలై 11వ తేదీన బోనోత్ శ్రీను, సుగుణ అనే దంపతులను మేకల నాగరాజు అనే వ్యక్తి హతమార్చాడు.కూతురితో పెళ్లికి ఒప్పుకోవడంలేదనే కారణంతో దారుణానికి ఒడిగట్టాడు.
కాగా కేసు విచారణ అనంతరం బుధవారం వరంగల్ అడిషనల్ జడ్జి నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

Tags: Death Sentence for Obsessed Lover