November 3, 2026
Explore
నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం

నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం

November 3, 2026 | Andhra Pradesh

4,108 ఓట్ల భారీ మెజార్టీతో చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజా గెలుపు

ఏలూరు ముచ్చట్లు:

నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన బర్రె ఇళయరాజా తన ప్రత్యర్థిపై 4,108 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో స్పష్టమైన ఆధిక్యం సాధించి చైర్మన్ అభ్యర్థిగా గెలుపొందారు.
ఈ విజయంతో నూజివీడులో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కూటమి అభ్యర్థికి ప్రజలు భారీ మెజార్టీతో పట్టం కట్టడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు తెలిపిన ఓటర్లకు టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం నూజివీడు రాజకీయాల్లో కూటమికి మరింత బలాన్ని చేకూర్చిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

Tags: TDP alliance secures a resounding victory in Nuzvid municipal elections