శ్రీకాకుళంముచ్చట్లు:
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 35వ వార్డులో టీడీపీ అభ్యర్థి జోగ త్రివేణి, వైసీపీ అభ్యర్థి అరుణకు సమానంగా ఓట్లు వచ్చాయి.
ఇద్దరికీ 340 ఓట్లు చొప్పున రావడంతో ఎన్నికల అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో వైసీపీ అభ్యర్థి అరుణ విజయం సాధించినట్లు ప్రకటించారు. దీంతో ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో లక్కీ డ్రా ద్వారా విజేత ఎవరో తేలింది.
Tags: YSRCP candidate wins in a lucky draw