రెండ్రోజుల పాటు జిల్లాలో పర్యటన
వై ఎస్ ఆర్ కడప ముచ్చట్లు:
రెండ్రోజుల పర్యటన నిమిత్తం జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గురువారం జిల్లాకు రానున్నారు. మొదటిరోజు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెండ్, మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగే పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొనబోతున్నారు. రెండోరోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో సోలార్ పవర్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పాల్గొనున్నట్లు మంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
గురువారం ఉదయం విజయవాడ నుంచి విమానంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడప ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకుని సేద తీరుతారు. సాయంత్రం 5.30 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని, రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ కు ఇతర టీడీపీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి మంత్రి నారా లోకేశ్ తో కలిసి నగరంలోని రాజరాజేశ్వరి కల్యాణ మండపం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జిల్లాకు చెందిన టీడీపీ శ్రేణులతో నిర్వహించే సమావేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమంలో కానున్నారు. రాత్రికి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ చేరుకుని రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు శుక్రవారం జమ్మలమడుగు నియోజక వర్గంలో సోలార్ పవర్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ తో కలిసి మంత్రి సవిత పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం రోడ్డు మార్గాన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు మంత్రి సవిత వెళ్లనున్నట్లు ఆ ప్రకటనలో మంత్రి కార్యాలయం తెలిపింది.
Tags: District In-charge Minister Savitha to Arrive on the 21st