July 5, 2026
Explore
వైభవంగా శ్రీగంగమ్మ ఆలయం ప్రారంభం

వైభవంగా శ్రీగంగమ్మ ఆలయం ప్రారంభం

July 5, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని చదళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీగంగమ్మ ఆలయాన్ని ఆదివారం వైభవంగా, భక్తిశ్రద్దలతో ప్రారంభించారు. గత మూడు రోజులుగా విశేష పూజలు నిర్వహించారు. వేదపండితులు, గ్రామస్తులు కలసి శ్రీ గంగమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి, ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారికి మహాకుంభాభిషేకం, పంచామృతాభిషేకం,పూర్ణాహుతి నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేశారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అత్యంత సుందరంగా గ్రామస్తులు కలసి నిర్మించిన గంగమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చదళ్ల తో పాటు ఆ పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Tags: Grand inauguration of Sri Gangamma Temple