బెంగళూరు ముచ్చట్లు:
బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు – ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో పాల్గొనడం గొప్ప గౌరవం – ఇది వ్యక్తిగత, వ్యవస్థ వేడుక కాదు.. మానవత్వ విలువలకు వేడుక – నేను సీఎంగా కాకుండా.. భారతీయుడిగా వేడుకకు వచ్చాను – గురుదేవ్ రవిశంకర్.. ఆధ్యాత్మిక నాయకుడే కాదు.. గొప్ప మానవతావాది – సామరస్య సందేశం చేరవేతతో పాటు ఆధునిక భారత్‌కు వారధి – జాతి నిర్మాణానికి తోడ్పడుతున్న రవిశంకర్‌కు ధన్యవాదాలు – అనేక ఖండాల్లో గురుదేవ్ దశాబ్దాలుగా సందేశాలు ఇస్తున్నారు – ఒత్తిడి రహిత మెదడు, హింస లేని సమాజం కోసం పాటుపడ్డారు – సమాజంలో నెలకొన్న సంఘర్షణలు, అస్థిరత పారద్రోలేందుకు కృషిచేశారు – ప్రపంచ దేశాల నుంచి మారుమూల గ్రామాల వరకు అహింస స్థాపనకు పాటుపడ్డారు – 45 ఏళ్ల క్రితం సాధారణ విజన్‌తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏర్పడింది – ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల కారణంగా దేశం ఇబ్బందుల్లో ఉంది – ఎంత కష్టకాలమైనా ఎదుర్కొనే గొప్ప నేత మోదీ ప్రధానిగా ఉన్నారు – ఏపీని టెక్నాలజీ హబ్‌గా రూపొందిస్తున్నాను – ఎన్నో కొత్త టెక్నాలజీలకు ఏపీని వేదికగా చేస్తున్నాను – ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ప్రశాంతత లేకుంటే ఉపయోగం ఉండదు – ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఏపీకి తన సేవలు అందించాలి – ఏపీని అత్యుత్తమ రాష్ట్రంగా నిలిపేందుకు గురూజీ సహకారం కావాలి : సీఎం చంద్రబాబు
Tags: Art of Living Anniversary in Bengaluru