పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని దోబికాలనికి వెళ్లే రహదారి సమీపంలో గల శివసాయినగర్‌కు రోడ్డు వేస్తారా..?వేయరా…? అంటు ఆప్రాంత వాసులు కమిషనర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆప్రాంతంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వ్యాపారులు జీవిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. పట్టణ నడిబొడ్డులో ఉన్న శివసాయినగర్‌కు రోడ్డు వేయకుండ కాలయాపన చేస్తుండడం వెనుక ఆంతార్యం ఏమిటని ఆప్రాంత వాసులు నిలధీస్తున్నారు. కాగా పట్టణ నడిబొడ్డులో ఉన్న ప్రాంతానికే రోడ్డు వేయకుండ నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారుల తీరును ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Tags: Won’t a road be laid to Shivasai Nagar?