పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని నక్కబండలో సుమారు 1400 కుటుంభాలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం ప్రక్కనే జగనన్న టిడ్కో గృహాలు కూడ నిర్మించారు. కానీ ఈ ప్రాంతానికి మంచినీటి సరఫరా చేయడంలో అధికారులు విఫలమైయ్యారు. గత ఆరు నెలల క్రితం పైపులైన్ల పనుల పేరుతో ఆప్రాంతంలోని పైపులైన్లు పెరికివేసి నూతన లైన్లు పూర్తిగా వేయకపోవడంతో నీటి సమస్య ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ సమస్య అలాగే కొనసాగుతోందని ఆప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నక్కబండ ప్రాంతానికి కనీసం సరిపడ ట్యాంకర్లతోనైన నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై అధికారులు స్పందించాలని, లేకపోతే మున్సిపాలిటి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Tags: Water problem in Nakkabanda