- ఎస్టీలకు ఒరిగిందేమి లేదు
- కమిషన్ ఆదేశాలు బుట్టదాఖలు చేసిన రెవెన్యూ
పుంగనూరుముచ్చట్లు:
ఎస్టీలకు దారి సమస్య పరిష్కరించాలంటు రెవెన్యూ అధికారుల చుట్టు కాలు అరిగిపోయేలా తిరిగిన ప్రయోజనం లేకపోయింది….ఈసమయంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప ఎస్టీల సమస్యలు పరిష్కరించేందుకు పుంగనూరు మండలం కుమ్మరగుంటలో పర్యటించారు. ఎస్టీల దారి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు చేశారు….వెళ్లారు…కానీ రెండు నెలలు గడిచిన ఆదేశాలను రెవెన్యూ అధికారులు అమలు చేయకపోవడంతో ఎస్టీ కులస్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కుమ్మరగుంట గ్రామంలో 70 కుటుంభాలకు చెందిన ఎస్టీ కులాల వారు ఉన్నారు. వీరికి కుమ్మరగుంట రోడ్డు నుంచి రాకపోకలు సాగించేందుకు దారి సమస్య ఉంది. ఎస్టీ కులస్తులకు దారి లేకపోవడంతో వర్షాకాలంలోను , రాత్రి పూట నానఅవస్థలు పడాల్సి వస్తోంది. ఈ విషయమై ఎస్టీ కమిషన్‌కు స్థానిక ఎస్టీ సంఘ అధ్యక్షుడు మర్రిబాబు ఫిర్యాదు చేశాడు. దీనిపై గత నెల 15న ఎస్టీ కమిషన్ సభ్యులు అన్నిశాఖల అధికారులను వెంట పెట్టుకుని కుమ్మరగుంటలో దారి సమస్యను పరిష్కరించారు. ఈ మేరకు రోడ్డు సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించి వెళ్లిపోయారు. ఆ సమస్యను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లక్షంతో ఎస్టీ కమిషన్ ఆదేశాలను గాలికి వదిలేశారు. సమస్య ఇంత వరకు పరిష్కారం కాకపోవడంతో స్థానిక ఎస్టీ సంఘ నాయకులు మండిపడుతున్నారు. అధికారులు ఇకనైన స్పందించి, ఎస్టీల సమస్యలు పరిష్కరిస్తారా…లేదా …ఎస్టీలతో పనేంటి అని వదిలివేస్తారా..?అన్నది వేచి చూడాల్సి ఉంది.


Tags: ST Commission members came… and left…