May 21, 2026
Explore
ఎవరికంటే వారికి సిమ్‌కార్డులు ఇవ్వద్దు

ఎవరికంటే వారికి సిమ్‌కార్డులు ఇవ్వద్దు

May 21, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

సెల్‌ఫోన్‌కు వినియోగించే సిమ్‌కార్డులను ఆధారాలు లేకుండ ఎవరికి పడితే వారికి డీలర్లు ఇవ్వరాదని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో పలు కంపెనీలకు చెందిన డీలర్లతో సమావేశం నిర్వహించారు. అనుమానితులకు సిమ్‌కార్డులు ఇవ్వడంతో సైబర్‌నేరాలు తీవ్రంగా జరుగుతోందన్నారు.అలాగే పలువురు డీలర్లు తమ వద్ద ఉన్న ఆధార్‌కార్డులతో ఎవరికిపడితే వారికి సిమ్‌కార్డులు ఇస్తున్నట్లు తెలిసిందన్నారు. దీని కారణంగా అమాయకులు ఇబ్బందులు పడుతారని తెలిపారు. సిమ్‌కార్డుల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగిన డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags; Do not issue SIM cards to just anyone.