May 21, 2026
Explore
ఎంఆర్‌పిఎస్‌చే గోటు విలేజ్‌

ఎంఆర్‌పిఎస్‌చే గోటు విలేజ్‌

May 21, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

మాదిగ రిజర్వేషన్‌ పోరాటసమితి ఆధ్వర్యంలో చేసిన పోరాటాలు, విజయాలు వివరిస్తూ 40 రోజుల పాటు గోటు విలేజ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ఇన్‌చార్జ్ కోటాడేనియల్‌ మాదిగ తెలిపారు. గురువారం నియోజకవర్గ ఇన్‌చార్జ్ నరసింహులు ఆధ్వర్యంలో ఎంఆర్‌పిఎస్‌ సమావేశం నిర్వహించారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గోటు విలేజ్‌ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తామని, యువతను భాగస్వామ్యం చేసి మాదిగ జాతి చైతన్యం కోసం తరలిరావాలని కోరారు. ప్రతి గ్రామంలో ఎంఆర్‌పిఎస్‌ జెండా ఆవిష్కరణ చేసి, ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి మురళి, జిల్లా నాయకుడు శంకర్‌ఫృద్వీకుమార్‌, గోవిందు, తొమరం నరసింహులు, వెంకట్రమణ, వెహోగిలీశ్వర, రెడ్డెప్ప , సుబ్రమణ్యం , మల్లికార్జున, నారాయణ, కదిరప్ప, బాబు, రమేష్‌, శ్రీనివాసులు, పెద్దరెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags: Gotu Village by MRPS