డిఎండ్‌అండ్‌హెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్య
పుంగనూరు ముచ్చట్లు:
ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం, మందులు అందించేలా డాక్టర్లు, సిబ్బంది పని చేయాలని డిఎండ్‌అండ్‌హెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్య ఆదేశించారు. గురువారం ఆయన పట్టణంలోని తూర్పువెహోగసాలలో గల పిహెచ్‌సిని, ముడిబాపనపల్లెలో గల పిహెచ్‌సిని తనిఖీ చేశారు. అలాగే పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్స్ సెంటర్లను , ల్యాబ్‌లను , ఫిజియోథెరపి సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులను, గర్భవతులను విచారించి సిబ్బంధికి పలు విషయాలపై సూచనలు చేశారు. అలాగే పిహెచ్‌సిల్లో పరిశుభ్రత కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. రోగులకు అందిస్తున్న సేవలను నిబంధనల మేరకు తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు తేజశ్వని, కిరణ్మయి, పిహెచ్‌సిల సూపర్‌వైజర్లు ప్రభాకర్, సిద్దార్థరెడ్డి, అమరనాథ్, అబ్ధుల్‌హాకీం తదితరులు పాల్గొన్నారు.
Tags: Quality services must be provided to every patient.