May 21, 2026
Explore
ఎయిడ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దాం

ఎయిడ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దాం

May 21, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రజలందరి సహకారంతో ఎయిడ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్నియంత్రణ అధికారి భాస్కర్‌ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఏరియా ఆసుపత్రిలోని ఐసిటిసి కేంద్రాన్ని పరిశీలించారు. రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. పలువురిని విచారించారు. హైరిస్క్ వ్యక్తులను గుర్తించి వారికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం , మందులు క్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలకు అవసరమైన కిట్లు, ఏఆర్‌టి మందులు నిల్వ ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు ప్రతి ఒక్కరు లక్ష్యాలను సాధించాలని కోరారు. ఈ సమావేశంలో కౌన్సిలర్‌ హిమవంతరెడ్డి, ఎల్‌టి రెహమాన్‌, ఐసిటిసి సిబ్బంది పాల్గొన్నారు.

Tags; Let us build an AIDS-free society.