May 21, 2026
Explore
ఎరువుల విక్రయాలు నిబంధనల మేరకు జరగాలి

ఎరువుల విక్రయాలు నిబంధనల మేరకు జరగాలి

May 21, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు నిబంధనల మేరకు విక్రయించాలని, అతిక్రమిస్తే డీలర్‌షీప్‌లు రద్దు చేస్తామని ఏడి శివకుమార్‌ హెచ్చరించారు. గురువారం ఆయన మండల స్థాయి డీలర్లతో సమావేశం నిర్వహించారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు ఇవ్వాలన్నారు. అలాగే కొన్ని మందులతో పాటు మరి కొన్ని మందలు కొనాలని నిబంధనలు పెట్టిన , అధిక ధరలకు విక్రయించిన, నాణ్యతలేని వస్తువులను నిల్వ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాక్‌ వివరాలను, ధరలను నోటీసు బోర్డులో వేయాలని సూచించారు. దీనిపై రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైన తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏవో రాధ తదితరులు పాల్గొన్నారు.

Tags: Fertilizer sales must be conducted in accordance with regulations.