పుంగనూరు ముచ్చట్లు:
నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడికి గురైయ్యే పోలీసు సిబ్బంది మానసికంగా , ఉల్లాసంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు హర్ట్పుల్‌నెస్ మెడిటేషన్ ప్రతి ఒక్కరు చేయాలని మాస్టర్ శివశంకర్ సూచించారు. మెడిటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సీఐలు సుబ్బరాయుడు, సాయినాథ్ లు హాజరైయ్యారు. మాస్టర్ శివశంకర్ మాట్లాడుతూ పోలీస్‌శాఖలో పని ఒత్తిడి ఎక్కువ ఉంటుందన్నారు. ఇలాంటి సమయంలో సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ద్యానం ఎంతో అవసరమన్నారు. మెడిటేషన్ తరగతులు మూడురోజులపాటు నిర్వహిస్తామని తెలిపారు. పోలీస్‌శాఖలో ఉన్న వారు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ తరగతులలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags; Heartfulness Meditation is for Mental Peace