May 21, 2026
Explore
హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్” (ధ్యానం) శిక్షణ తరగతులు.

హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్” (ధ్యానం) శిక్షణ తరగతులు.

May 21, 2026 | Andhra Pradesh

అనకాపల్లి ముచ్చట్లు:

నిరంతర విధులతో ఒత్తిడికి గురయ్యే పోలీస్ సిబ్బంది మానసిక ప్రశాంతత కోసమే ఈ శిక్షణ: అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ వింగ్ సౌజన్యంతో అనకాపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించే ఉచిత “హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్” (ధ్యానం) మరియు యోగా శిక్షణా తరగతులు ఈ రోజు (గురువారం) ఉదయం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి.
​అనకాపల్లి పార్క్ సెంటర్ సమీపంలోని ” గౌరీ సేవా సంఘం మరియు కోనతాల సుబ్రహ్మణ్యం ఏసీ కళ్యాణ వేదిక” నందు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థకు చెందిన ప్రముఖ శిక్షకులు (ట్రైనర్స్) ఐ.సంజీవ రాజు, డాక్టర్ కె.ఎమ్.కె.రావు ఆధ్వర్యంలో సిబ్బందికి ధ్యానం, శ్వాసక్రియలపై తొలిరోజు సాధన చేయించారు.
​మానసిక ప్రశాంతతతోనే మెరుగైన సేవలు:
​ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణి పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ…
​”రాత్రింబవళ్లు ప్రజల రక్షణ కోసం నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ అధికారులు, సిబ్బంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ ఒత్తిడి వారి వ్యక్తిగత జీవితాలపై, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను పొందేలా చేయడానికే జిల్లా ఎస్పీ గారి ప్రత్యేక చొరవతో ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రశాంతమైన మనస్సుతో విధులు నిర్వహిస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చు.
మూడు రోజుల పాటు జరిగే ఈ సువర్ణ అవకాశాన్ని సబ్ డివిజన్ పరిధిలోని ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉపయోగించుకోవాలి.”
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డ్రోన్ విజువల్స్:
​తొలిరోజు శిక్షణలో భాగంగా పోలీస్ సిబ్బంది అంతా ఒకేచోట చేరి ఏకాగ్రతతో యోగా, ధ్యాన ముద్రల్లో ఉన్న దృశ్యాలను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. క్రమశిక్షణతో కూడిన సిబ్బంది యోగా సాధన డ్రోన్ విజువల్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పాల్గొన్న అధికారులు మరియు సిబ్బంది:
​ఈ ప్రారంభ కార్యక్రమంలో అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ప్రేమ కుమార్, అశోక్ కుమార్, స్వామి నాయుడు, అప్పలరాజు, కోటేశ్వరరావు, వివిధ పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్‌స్పెక్టర్లు, మహిళా పోలీసులు మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఈ శిక్షణా తరగతులు మే 23వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 08:00 గంటల నుండి 09:00 గంటల వరకు కొనసాగుతాయి.

Tags:”Heartfulness Meditation” Training Classes