రామాపురం ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కల్పనాయన చెరువు పడమర వైపున అడవిలో, కొండ సమీపంలో గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మృతుడు పూల డిజైన్ ఉన్న లుంగీ, నీలి రంగు డ్రాయర్, ఆకుపచ్చ రంగు మరో డ్రాయర్ అలాగే పసుపు రంగు గీతల షర్ట్ ధరించి ఉన్నట్లు తెలిపారు.
ఎవరైనా వ్యక్తి కనిపించకపోవడం గానీ, పై మృతదేహం వివరాలు తెలిసిన వారు గానీ వెంటనే రామాపురం ఎస్‌ఐను 9121100558 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.
Tags: Police Appeal for Identification of Unidentified Male Body