బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ మణికొండ పరిధిలో మహిళ పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.
ఈ వీడియో వైరల్ అవడంతో దీని ఆధారంగా పోలీసులు బాధిత మహిళను గుర్తించారు.
ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు.
నిందితుడి ఆనవాళ్ల కోసం ఆ ఏరియాలోని 50-60 సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.
ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Tags: Psycho Harasses Woman in the Middle of the Road