అమరావతిముచ్చట్లు:
ఒక నిమిషంలో అత్యధిక స్వరాలను గుర్తించి గిన్నిస్ రికార్డు సాధన దిశగా లిటిల్ బ్రెయిన్స్ విద్యార్థిని
విజయవాడ గాంధీనగర్ లో ని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం లో ఘనంగా రికార్డు ప్రయత్న వేడుక
9 ఏళ్ల వయసు.. 4వ తరగతిలోనే అసాధారణ సంగీత మేధస్సు చాటిన ఆన్వి గుండు దేశానికి, రాష్ట్రానికి గర్వకారణం ముఖ్య అతిథి, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ప్రశంసల జల్లు
చిన్న వయస్సులోనే సంగీతంపై అపూర్వమైన పట్టు కనబరుస్తూ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (ప్రపంచ రికార్డుల పుస్తకం) సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తొమ్మిదేళ్ల బాలిక, చిన్నారి ఆన్వి ప్రతిభ అందరినీ అబ్బురపరిచింది. ఒక నిమిషంలో అత్యధిక సంగీత స్వరాలను (మ్యూజికల్ నోట్స్) గుర్తించడం అనే విభాగంలో ఈ చిన్నారి గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధన కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ విభాగంలో ఉన్న ప్రపంచ రికార్డు 62 సంగీత స్వరాలను గుర్తించడం కాగా, ఆన్వి అంతకంటే ఎక్కువ స్వరాలను క్షణాల వ్యవధిలో అత్యంత వేగంగా గుర్తిస్తూ పాత రికార్డును బద్దలు కొట్ట.
Tags: Anvi’s Roaring World Record in Identifying Musical Notes