May 19, 2026
Explore
మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన

మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన

May 19, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ దీరజ్ ఆదేశాల మేరకు బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్‌ఫ్రీ నంబర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ గోపాల్ రెడ్డి, శక్తి టీం సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Special Awareness on Women’s Safety