November 3, 2026
Explore
ఇంటి అద్దెకు సంబంధించిన వివాదం

ఇంటి అద్దెకు సంబంధించిన వివాదం

November 3, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని బోస్ నగర్‌కు చెందిన షేక్ బాషా వలి, వయస్సు 32 సంవత్సరాలు, తండ్రి పేరు ఎస్. అహమ్మద్ భాష, అనే వ్యక్తి ఇంటి అద్దెకు సంబంధించిన వివాదం నేపథ్యంలో తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి సమస్య పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఈ ఫిర్యాదు మేరకు రాయచోటి అర్బన్ పోలీసులు సదరు వ్యక్తిని విచారించేందుకు ప్రయత్నించగా, అతని ప్రవర్తన మరియు మాటతీరును గమనించిన పోలీసులకు అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంవలన
పోలీసులు సంయమనం పాటిస్తూ, ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడకుండా వ్యవహరించారు.
ఐతే కొంతమంది ఎలాంటి సమాచారం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు సోషియల్ మీడియా లో పెట్టడం వలన రాయచోటి ప్రజలు భయబ్రాంతులు చెందడమే కాకుండా రాయచోటి పరువు పోయేవిధంగా వారి సొంత అజెండా ల తో ప్రచారం చేయడం నేరం వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకోబడును.

ఈ నేపథ్యంలో సదరు వ్యక్తిని చట్టపరమైన విధానంలో విచారించి, అవసరమైతే వైద్య పరీక్షల నిమిత్తం సంబంధిత ఆసుపత్రికి తరలించడం లేదా అందుబాటులో ఉన్న ఆధారాలు మరియు చట్టపరమైన నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.వి. చలపతి ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:A dispute regarding house rent