అన్నమయ్య జిల్లాముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న విద్యా కార్యక్రమాల తీరును పరిశీలించేందుకు రాష్ట్ర పరిశీలకురాలు అమృత ప్రియదర్శిని (జోన్–IV) పర్యటించారు. సమగ్ర శిక్ష అన్నమయ్య జిల్లా AMO నదీర్షాతో కలిసి పలు పాఠశాలలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.
ఈ సందర్భంగా మర్రిపాడు, తరిగొండ, ముదివేడు ప్రాంతాల్లోని ఐదు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. మర్రిపాడులోని MPPS ఉర్దూ, MPPS తెలుగు పాఠశాలలు, తరిగొండలోని MPUPS, MPPS తెలుగు పాఠశాలలు, ముదివేడులోని MPPS పాఠశాలను పరిశీలించారు.
పాఠశాలల్లో అమలవుతున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమం, FLN కిట్ల వినియోగం, విద్యార్థులకు అందిస్తున్న అభ్యసన సామగ్రి, Outdoor Play Material వినియోగంపై ప్రత్యేకంగా సమీక్షించారు. విద్యార్థులు అభ్యసన సామగ్రిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఆటల ద్వారా నేర్చుకునే అవకాశాలు ఏ మేరకు కల్పిస్తున్నారనే అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అమృత ప్రియదర్శిని మాట్లాడుతూ, విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు FLN కిట్లను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. అలాగే Outdoor Play Material ను విద్యార్థులకు అందుబాటులో ఉంచి, ఆటల ద్వారా అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో MEO-II గుర్రంకొండ వెంకటరమణ నాయక్, EE సుధాకర్, ఏజిలాని భాష తదితరులు పాల్గొన్నారు.
Tags: State observer Amrutha Priyadarshini visited government schools.