రికార్డులు, పరిసరాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ; పాల్గొన్న అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు.
మునగపాక, చోడవరం, అచ్యుతాపురం, రాంబిల్లి పరిధిలోని పలు కీలక కేసుల ఛేదన.
ఒరిస్సా, హైదరాబాద్‌లలో చాకచక్యంగా నిందితులను పట్టుకున్న సీసీఎస్, స్థానిక పోలీసులు.
ప్రతిభ కనబరిచిన సీసీఎస్ సిబ్బందిని పేరుపేరునా అభినందించిన జిల్లా ఎస్పీ.
అనకాపల్లి ముచ్చట్లు:
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా జిల్లా కేంద్రంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు సమక్షంలో జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా ఎస్పీ స్టేషన్ ఆవరణను పరిశీలించి, శాంతిభద్రతలు మరియు నేరాల నియంత్రణకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, రికార్డుల క్రమబద్ధీకరణపై సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎస్పీ , అదనపు ఎస్పీ మార్గదర్శకత్వంలో సీసీఎస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వేసవి కాలంలో ఇళ్లు తాళాలు వేసి ఉండటం వల్ల చోరీలు జరిగే అవకాశం ఎక్కువ ఉన్నందున పాత నేరస్థులు (KDs), బ్యాడ్ క్యారెక్టర్స్ (BCs) మరియు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, ‘ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్’ సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని ఆదేశించారు.
కీలక కేసుల ఛేదన – నిందితుల అరెస్ట్ వివరాలు:
ఈ సందర్భంగా సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడు నేతృత్వంలో సీసీఎస్ పోలీసులు, స్థానిక పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి సంయుక్తంగా సాధించిన విజయాలను ఎస్పీ కి వివరించారు. ఇటీవల కాలంలో ఛేదించిన ముఖ్యమైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
మునగపాక గ్రేవ్ కేసు: మునగపాక పోలీసులతో కలిసి సీసీఎస్ సిబ్బంది ఈ కేసులోని ప్రధాన ముద్దాయి కోన రాకేష్ ను చాకచక్యంగా పట్టుకున్నారు.
చోడవరం గ్రేవ్ కేసు : ఈ కేసులో నిందితుడైన కోరాడ సూర్య ప్రకాష్ ను సీసీఎస్ మరియు చోడవరం పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మరో నిందితుడు పోలా భాస్కరరావు ను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు.
అచ్యుతాపురం వైన్ షాప్ కేసు: ఈ కేసులో నిందితుడైన పెందుర్తి నాగరాజు ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీరియల్ క్రైమ్స్ : ఎలమంచిలి టౌన్, ఎలమంచిలి రూరల్, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం పరిధిలో పలు నేరాలకు పాల్పడిన అంతర్-రాష్ట్ర ముద్దాయి సిరికి విజయ్ కుమార్ ను రాంబిల్లి మరియు సీసీఎస్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి అరెస్ట్ చేశారు.
రౌడీషీటర్ అరెస్ట్: మునగపాక పోలీసులతో కలిసి సీసీఎస్ బృందం రొంగలి ప్రకాష్ తో పాటు వైజాగ్ కు చెందిన ప్రముఖ రౌడీషీటర్ ఈర్ల వినయ్ కుమార్ ను పట్టుకున్నారు.
రాంబిల్లి చైన్ స్నాచింగ్ కేసు (హైదరాబాద్‌లో అరెస్ట్): రాంబిల్లి పి.ఎస్ పరిధిలో జరిగిన గొలుసు దొంగతనం కేసులో నిందితుడైన సిరిపల్లి రాజేష్ ను సీసీఎస్ సిబ్బంది హైదరాబాద్ వెళ్లి మరీ పట్టుకోవడం విశేషం.
మునగపాక టెంపుల్ అఫెన్స్: మునగపాక పరిధిలోని దేవాలయంలో హుండీ దొంగతనానికి పాల్పడిన పెంటకోట ప్రసాద్ అలియాస్ ‘హుండీ ప్రసాద్’ ను సీసీఎస్ స్టాఫ్ అరెస్ట్ చేశారు.
సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు:
కఠినమైన కేసులను సాంకేతికత మరియు చాకచక్యంతో ఛేదించి, పొరుగు రాష్ట్రాలకు సైతం వెళ్లి ముద్దాయిలను బంధించిన సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడు ని, వారి బృందాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా శ్లాఘించారు. ఈ ఆపరేషన్లలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారిని, కానిస్టేబుల్‌ను ఆయన పేరుపేరునా పిలిచి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేసి జిల్లాను నేరరహితంగా మార్చాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడు, ఎస్సైలు విశ్వనాథం మరియు సీసీఎస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:District SP Tuhin Sinha conducted a surprise inspection of the police station.