మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్‌లో కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్న 12 ఉద్యోగాలకు ఈనెల 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ హైమావతి తెలిపారు.
ఈ ఉద్యోగాలకు 59 మంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులైన వారికి ఇంటర్వ్యూ కాల్ లెటర్లు పంపినట్లు పేర్కొన్నారు. మదనపల్లె సీడీపీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
Tags: Interviews for ICDS jobs tomorrow.