అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వాల్మీకిపురం మండలానికి చెందిన పులిరెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీ.వి.ఎన్. మాధవ్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ కార్యవర్గ సభ్యులకు నరేంద్ర కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో గ్రామస్థాయి నుంచి బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేసి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Tags:Narendra Kumar Reddy Appointed as BJP President