అమరావతిముచ్చట్లు:
▪️ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఖజానాపై ప్రతినెలా రూ.86 లక్షలు అదనపు భారం.
సామాజిక భద్రత ఫించన్ల అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం క్రింద తీవ్రమైన కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేయించుకుంటోన్న బాధితులు, కిడ్నీ, కాలేయ, గుండె మార్పిడి చేయించుకున్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా 895 కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారిక ప్రకటన చేశారు.
Tags: 895 New Pensions for Kidney, Liver, and Heart Patients