August 12, 2026
Explore
నేడు సంపూర్ణ సూర్య గ్రహణం

నేడు సంపూర్ణ సూర్య గ్రహణం

August 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈ ఏడాదిలో సంభవించే అత్యంత అరుదైన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. ఈ ఖగోళ అద్భుతం ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో కనిపించనుంది. అయితే, భారత కాలమానం ప్రకారం రాత్రిపూట ఉండటంతో మనదేశంలో ఇది కనిపించదు. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల వరకు కనిపించే ఈ గ్రహణంలో స్పెయిన్, ఐస్‌లాండ్ దేశాల్లో మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం ప్రత్యక్షమవుతుంది. మిగిలిన 53 దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణంగా దర్శనమివ్వనుంది.

Tags: Total solar eclipse today.