August 12, 2026
Explore
సచివాలయంలో అర్ధరాత్రి పనులు

సచివాలయంలో అర్ధరాత్రి పనులు

August 12, 2026 | Andhra Pradesh

తాళాలు వేయకుండ వెళ్లిన వైనం

  • పోలీస్‌ నిఘాలో వెల్లడి

పుంగనూరుముచ్చట్లు:

సచివాలయంలో అర్ధరాత్రి వరకు పనుల పేరుతో ఉండి , అదమరచి తాళాలు వేయకుండ వెళ్లారో….లేదా ….తెలియదు కానీ మండలంలోని ఉలవలదిన్నె సచివాలయానికి తాళాలు వేయకుండ ఉండటంతో అర్ధరాత్రి బీట్‌ పోలీసులు కనుగొని తాళాలు వేశారు. బుధవారం ఉదయం ఈ విషయం వెలుగుచూసింది. కాగా సచివాలయంలో ఒక కార్యదర్శితో పాటు ఒక స్నేహితుడు ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరు అర్ధరాత్రి వరకు అక్కడ ఏం చేశారన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. ఈ విషయమై ఎంపీడీవో అప్పాజిని వివరణ కోరగా సచివాలయానికి తాళాలు వేయకుండ వెళ్లిన మాట వాస్తవమేనని, దీనిపై విచారణ జరుపుతున్నామని, పొరపాట్లు జరిగిఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags: Late-night work at the Secretariat