. హైయెస్ట్ ఎక్కడంటే?
అమరావతిముచ్చట్లు:
ఇప్పటి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలకు పిల్లలను సాధారణ ప్రైవేట్ స్కూల్లో చేర్పించడం కూడా సులభం కాదు… ఫీజులు లక్షల స్థాయికి చేరుకున్నాయి. మరి కోటీశ్వరులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల పిల్లలు చదివే స్కూళ్లలో ఫీజులు ఇంకెంత ఉంటాయో ఊహించగలరా? ఏడాదికి ఒక పెద్ద ఉద్యోగి సగటు జీతం అంత ఫీజు ఇక్కడ ఉంటుంది. దేశంలోనే అత్యంత ఖరీదైన పాఠశాలలు ఏవి? అక్కడ ఫీజులు ఎంత ఉంటాయో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు..మరి ఆ వివరాలు చూద్దాం..
లక్షల్లో ఫీజులు… చూపరులను ఆశ్చర్యపరిచే సౌకర్యాలు:
మన దేశంలో కొన్ని స్కూళ్లలో వార్షిక ఫీజులు రూ. 10 లక్షల నుంచి ప్రారంభమై రూ. 22 లక్షల వరకూ వెళ్తున్నాయి. ముంబైలోని అంబాని ఇంటర్నేషన్ల్ స్కూల్ లో చదవాలంటే సంవత్సరానికి దాదాపు రూ. 12 లక్షల నుంచి మొదలై, రూ. 15 లక్షలకు మించి కూడా ఫీజులు వసూలవుతున్నాయి. ఇక అలాగే డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ ‘డూన్ స్కూల్’ లో కూడా దాదాపు రూ. 15 లక్షల వరకు ఉంటుంది. ఒక సామాన్యుడి జీవితకాల పొదుపు ఇక్కడ కేవలం ఒక ఏడాది ఫీజుతో సమానం అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
అత్యంత ఖరీదైన పాఠశాలలు ఇవే:
Tags: If you look at the fees at these schools in India, you would have to sell off your assets.