March 19, 2026
Explore
ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం

ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం

March 19, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయ శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్‌ 1వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరుగనున్న శ్రీసీతారాముల కల్యాణానికి విచ్చేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్,ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని గురువారం టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆహ్వానించారు.ఈ సందర్భంగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ను విజయవాడలోని గవర్నర్ బంగ్లాలో శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ముఖ్యమంత్రిని అమరావతిలోని సిఎం స్వగృహంలో శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.టిటిడి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి అదనపు ఈవో వెంట ఆలయ డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు.

Tags: Invitation Extended to the State Governor and Chief Minister for the Celestial Wedding of Lord Rama at Ontimitta