July 25, 2026
Explore
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం.. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా!

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం.. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా!

July 25, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండల వ్యాప్తంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై, ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

Tags: Aiming to curb road accidents… Crackdown on traffic violations!