July 25, 2026
Explore
పెద్దమండ్యంలో “డ్రగ్స్ వద్దు బ్రో”.. పోలీసుల అవగాహన

పెద్దమండ్యంలో “డ్రగ్స్ వద్దు బ్రో”.. పోలీసుల అవగాహన

July 25, 2026 | Andhra Pradesh

పెద్దమండ్యం ముచ్చట్లు:

పెద్దమండ్యం మండలంలో ఎస్‌ఐ హరిహర ప్రసాద్ ఆధ్వర్యంలో “డ్రగ్స్ వద్దు బ్రో”, “పల్లె బాటలో ఈగల్” అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, గ్రామస్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, మహిళా భద్రత, పోక్సో చట్టం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు జరిగితే వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలన్నారు. సమాచారదాత వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. యువత మత్తుకు దూరంగా ఉండి నేరరహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

Tags: “Say No to Drugs, Bro” – Police awareness campaign in Peddamandyam.