May 14, 2026
Explore
ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి

ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి

May 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని బాలగురవయ్యగారిపల్లెలో నివాసం ఉన్న దళితవాడకు చెందిన మహిళలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డీటి మాధవిని కోరారు. గురువారం మహిళలు తహశీల్ధార్‌ కార్యాలయంకు వచ్చి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు వస్తే దళితవాడ ముంప్పుకు గురౌతుందని, 50 కుటుంబాలు ఉన్న తమకు ప్రతి యేటా ఆ సమయంలో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమకు ఎత్తెన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపుతామని డీటి హామి ఇచ్చారు.

Tags: Request for the Allotment of House Sites