అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్, విద్య, వైద్య, రవాణా, విద్యుత్ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాల్లో 15,957 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని స్పష్టం చేశారు.
ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, తాగునీరు, విద్యుత్, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ నంబర్ 9866112750 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
Tags: All arrangements are in place for the Intermediate Advanced Supplementary examinations.