May 14, 2026
Explore
మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజా దర్బార్

మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజా దర్బార్

May 14, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన స్వగృహంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పోటెత్తారు. సుమారు 125 మంది బాధితులు హాజరై రెవెన్యూ, పెన్షన్లు, తాగునీరు మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించిన వినతులను సమర్పించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే, సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ బాధితులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తక్షణ స్పందన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Tags: MLA Shajahan Basha’s Praja Darbar in Madanapalle