May 14, 2026
Explore
కువైట్‌లో సుగవాసి ప్రసాద్ బాబుకు ఘన స్వాగతం

కువైట్‌లో సుగవాసి ప్రసాద్ బాబుకు ఘన స్వాగతం

May 14, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట పార్లమెంట్ టీడీపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గురువారం ఉదయం కువైట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కువైట్‌లో నిర్వహించనున్న మినీ మహానాడు – 2026 మరియు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 104వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు.
విమానాశ్రయం వద్ద కువైట్ టీడీపి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రవాస తెలుగు ప్రజలు ఆయనకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రవాసాంధ్రుల అభిమానానికి ప్రసాద్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో ఆయన ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Tags: Grand Welcome for Sugavasi Prasad Babu in Kuwait