-రాష్ట్ర రైతు నాయకులు ఉమాపతి నాయుడు
అమరావతిముచ్చట్లు:
ఖరీఫ్ సీజన్ (2026-27)కు కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు రైతాంగానికి ఏ మాత్రం ఊరట కలిగించేలా లేవని AIKMS.రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమాపతి నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ,డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనలకు అనుగుణంగా మద్దతు ధరలు నిర్ణయిస్తామని ఆశలు కల్పించిన కేంద్ర ప్రభుత్వం…రైతాంగాన్ని నిరాశకు గురిచేస్తోందన్నారు. రైతుల ఆదాయం, వ్యవసాయ రంగ బలోపేతం లక్ష్యంగా రైతుల్లో విశ్వాసాన్ని పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఏ మాత్రం అడుగులు వేయడంలేదని తెలిపారు.రైతులకు మద్దతు ధరలు లభించక ప్రతి సంవత్సరం దాదాపు రూ.3లక్షల కోట్లు రైతాంగం నష్టపోతున్నారని, పెట్టుబడి ఖర్చుకు సీ2 + 50శాతం జోడించి మద్దతు ధరలు నిర్ణయించాల్సి ఉండగా, రాబోయే ఖరీఫ్ సీజన్‌కు ప్రకటించిన పంటల మద్దతు ధరలు రైతాంగానికి నిరాశ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.ధాన్యానికి గత సంవత్సరం కంటే..కేవలం రూ.72 పెంచి ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం తగదన్నారు.
మొక్కజొన్న గతేడాది కంటే రూ.10 పెంచారని, కానీ గతేడాది రూ.2400 మద్దతు ధర ఉన్నప్పటికీ, మార్కెట్లో రూ.1600 నుంచి రూ.1700కు మాత్రమే వ్యాపారస్తులు కొనుగోలు చేస్తుంటే..రైతాంగాన్ని ఆదుకునేందుకు రూ.2400 ప్రకారం మార్క్‌ఫెడ్,నా ఫెడ్ ల ద్వారా పంటను కొనుగోలు చేయాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహించాయన్నారు.ప్రతి క్వింటాకు రూ.700 నుంచి రూ.800 రైతులు నష్టపోతుంటే పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గమని తెలిపారు.అరకొర మద్దతు ధరలు పెంచి, రైతులకు నిరాశ కలిగించే ప్రయత్నంమే కానీ రైతులకు లాభసాటి ధరలు మాత్రం శూన్యం. వ్యవసాయదారులు దేశ ప్రజానికానికి మూడు పూటలా కడుపునిండా అన్నం పెట్టి ఆదుకునేందుకు రాత్రింబవళ్లు అష్టకష్టాలు పడి అప్పులు చేసి కాయకష్టంతో పండించిన ఆహార ఉత్పత్తులను దేశ ప్రజానికానికి మూడు పూటలా కడుపునిండా అన్నం పెట్టి ఆకలి తీర్చి ఆదుకుంటున్న అన్నదాతకు ఈరోజు పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా ఒకవైపు మామిడి.ఇతర ఉద్యాన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక కొందరు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
అలాంటి అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం లాభ సాటి ధరలు లేకుండా ఒకవైపు గిట్టుబాటు ధర లేక కంటతడి పెడుతున్న రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని జాతీయ రైతు సంఘాల సమన్వయ సమితి డిమాండ్ మేరకు రాష్ట్ర రైతాంగానికి మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని,నామ మాత్రపు మద్దతు ధర పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సీ2+ 50 శాతం ప్రకారం మద్దతు ధరలు లభించేలా కేంద్ర ప్రభుత్వంపై.రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలని తీసుకురావాలని AIKMS.రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులైన వెంకటరత్నం.మరియు ఉమాపతి నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Tags: The increase in support prices introduced by the Central Government for farmers is merely nominal.