May 14, 2026
Explore
NEET పేపర్ లీక్‌పై రాయచోటిలో నిరసన

NEET పేపర్ లీక్‌పై రాయచోటిలో నిరసన

May 14, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద NEET పేపర్ లీక్ ఘటనను ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు, పట్టణ నాయకులు నరేష్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. NEET పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Tags: Protest in Rayachoti over NEET paper leak