May 14, 2026
Explore
బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం..!

బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం..!

May 14, 2026 | Andhra Pradesh

ఇళ్లలోని బంగారంపై కేంద్రం ఫోకస్.. త్వరలో కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ప్రజల ఇళ్లలో నిల్వగా ఉన్న బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్ పాలసీ’ తీసుకురానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పథకాల కంటే మరింత సులభతరం చేసి, కనీసం 10 గ్రాముల బంగారం ఉన్న వారికీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అవకాశం కల్పించేలా కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నులకుపైగా బంగారం నిల్వగా ఉందని అంచనా. అయితే ఈ బంగారం ఎక్కువ భాగం ఇళ్లలో, లాకర్లలోనే ఉండిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా ఉపయోగపడటం లేదు. మరోవైపు దేశం ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరగడమే కాకుండా రూపాయి విలువపై కూడా ప్రభావం పడుతోంది.కొత్త పాలసీలో ఉండే అవకాశమున్న అంశాలు..తక్కువ పరిమాణంలో బంగారం డిపాజిట్ చేసే అవకాశం.

Tags: Centre’s Sensational Decision on Gold!