రాజంపేట ముచ్చట్లు:
రాజంపేటలో కాల్షియం కార్బైడ్, ఇతర నిషేధిత రసాయనాలతో పండ్లను కృత్రిమంగా మగ్గబెట్టి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి డా. శమీమ్ బాషా, మున్సిపల్ కమిషనర్ ఎస్. లక్ష్మీ నారాయణ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజంపేట మార్కెట్, పండ్ల మండీలు, దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మామిడి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యానికి హానికరమైన రసాయనాల వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఆహార భద్రత చట్టం ప్రకారం ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Tags: Strict action will be taken against those who ripen fruits using banned chemicals.