May 14, 2026
Explore
సీటీఎం చెరువు గట్టున మృత శిశువు కలకలం

సీటీఎం చెరువు గట్టున మృత శిశువు కలకలం

May 14, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మండలం సీటీఎం చెరువు గట్టు వద్ద బాలుడి మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. మదనపల్లె –తిరుపతి హైవే పక్కన ముళ్ల పొదల్లో టవల్‌లో చుట్టిన స్థితిలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న సీఐ కళా వెంకటరమణ, ఎస్సై చంద్రమోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృత శిశువు వద్ద దుస్తులు, టవల్‌, నిక్కర్‌, టీషర్ట్ లభించాయని, బాలుడి ఆచూకీ తెలిసిన వారు సీఐ: 9440796742, ఎస్సై: 9440796743 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Tags: Dead Infant Found at CTM Tank Bund Causes Stir