గాలివీడు ముచ్చట్లు:
గాలివీడు మండల కేంద్రంలో ఓ వస్త్ర వ్యాపారి కోట్ల రూపాయల అప్పులు చేసి పరారైన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. సినిమా థియేటర్ సమీపంలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి, వ్యాపార విస్తరణ పేరుతో స్థానికులు, స్నేహితులు, వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి దశలవారీగా సుమారు రూ.2 కోట్ల వరకు అప్పులు తీసుకున్నట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా దుకాణం మూసివేయడంతో బాధితులకు అనుమానం వచ్చి ఆరా తీయగా వ్యాపారి పరారైనట్లు తెలిసింది. దీంతో డబ్బులు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Tags: Rs 2 Crore Fraud Rocks Galiveedu