పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు పట్టణంలో యాదవ ఎంప్లాయిస్ సొసైటీ వైఈఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. కార్యక్రమానికి బీసీవై పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి హరిబాబు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా హరిబాబు యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది చదువేనని విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని హరిబాబు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పుంగనూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.

Tags: Awards for Talented Students