May 13, 2026
Explore
అధికారుల పనితీరుపై కూటమి నేతల నిరసన

అధికారుల పనితీరుపై కూటమి నేతల నిరసన

May 13, 2026 | Andhra Pradesh

మండల కార్యాలయం ముందు బైఠాయింపు

పుంగనూరుముచ్చట్లు:

తహశీల్ధార్‌, ఎంపీడీవో , ఆర్‌ఐ, వీఆర్‌వోలు సక్రమంగా పని చేయడం లేదని , సకాలంలో విధులకు హాజరుకావడం లేదని , నిర్లక్షంతో ప్రజా సమస్యలు విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ కూటమి నేతలు బుధవారం స్థానిక మండల కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తెలుగుదేశం నాయకులు మాధవరెడ్డి, జనసేన నాయకుడు విరూపాక్షి, బిజెపి నాయకుడు నరసింహులు, కుమార్‌ తదితరులు కలసి కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తహశీల్ధార్‌ రాము, ఆర్‌ఐ ఫణికుమార్‌, వీఆర్‌వోలు , ఎంపీడీవో అప్పాజి ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని తీవ్రంగా ఆరోపించారు. సకాలంలో విధులకు రావడం లేదని, ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎంపీడీవోను మండల కాంప్లెక్స్లో కూటమి నేతలు కుర్చునేందుకు రూము అడిగితే ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈవిధంగా పలు ఆరోపణలు అధికారులపై చేస్తూ , ఈ అధికారులు కూటమి నేతలు చెబితేనే చేయడం లేదని , ఇక ఎవరు చెబితే పనులు చేస్తారో చెప్పాలంటు నిలధీశారు. అధికార పార్టీ నాయకులు అధికారులపై ఆరోపణలు చేయడం సర్వత్ర చర్చనీయాంశమైంది. దీనిపై జిల్లా కలెక్టర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Tags: Coalition leaders protest against the performance of officials