బండరాళ్లు పడటంతో మృతి
పుంగనూరుముచ్చట్లు:
క్వారీలో పని చేస్తున్న కార్మికుడిపై పై నుంచి బండరాళ్లు పడటంతో కార్మికుడు గాయాలపాలై ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పాలెంపల్లెకి చెందిన క్వారీలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జనార్ధన్‌నాయక్(35) క్వారీ క్రింద భాగంలో డ్రిల్లింగ్ చేస్తుండగా పైన బండరాళ్లను క్రేన్లతో లారీలో భర్తీ చేస్తుండగా పై నుంచి రాళ్లు పడటంతో జనార్ధన్‌నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వేలూరు సిఎంసికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించాడు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా క్వారీ యాజమాన్యం సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం, కార్మికులకు ఇన్సూరెన్సు లేకపోవడంపై బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags: Worker dies due to quarry owner’s negligence