మోదీ పొదుపు మంత్రం
పశ్చిమాసియా ముచ్చట్లు:
పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని సూచించిన ప్రధాని మోదీ.. స్వయంగా వాటిని పాటించేందుకు సిద్ధమయ్యారు. తన అధికారిక కాన్వాయ్లెని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని మోదీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వాటి ప్రకారం.. ప్రస్తుత ఉద్రిక్తతల వేళ ఇంధన ఆదాకు ప్రయత్నించాలంటూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ చర్యలను స్వయంగా అమలుచేయాలని మోదీ నిర్ణయించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులోభాగంగా తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)కి మోదీ సూచించారు. దీంతోపాటు కాన్వాయ్స్ ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. అయితే, ఇందుకోసం కొత్తగా ఎలాంటి వాహనాలను కొనుగోలు చేయకూడదని స్పష్టంచేశారు. భద్రతా ప్రొటోకాల్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూనే ఎస్పీజీ ఈ ఆదేశాలను అమలుచేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రధాని పిలుపు మేరకు దిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సహా ఇతర మంత్రులు కూడా తమ అధికారిక కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను ఇప్పటికే తగ్గించారు.
Tags: PM’s Convoy Cut by Half