May 13, 2026
Explore
రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష

రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష

May 13, 2026 | Andhra Pradesh

శ్రీ సత్యసాయి ముచ్చట్లు:

ఈ నెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మరియు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పుట్టపర్తి పర్యటనకు రానున్న నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ సెక్టార్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా సత్యసాయి విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన బందోబస్తు చర్యలు, కాన్వాయ్ రూట్లలో అమలు చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు,
సభా ప్రాంగణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కాన్వాయ్ ప్రయాణించే మార్గాలను ముందస్తుగా పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. విఐపీ, వివిఐపీ వాహనాలు మరియు ప్రజల వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
సభా ప్రాంగణంలోని ప్రవేశ ద్వారాల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.

సభ ఏర్పాట్లు పరిశీలన….
సభా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ , అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ఐపీఎస్, ఇంచార్జ్ పోలీస్ అధికారులతో కలిసి
సభ ప్రాంగణంలో వేదిక ఏర్పాట్లు, వివిఐపి, వీఐపీ, ఎంట్రీ, పార్కింగ్ ప్రాంతాలు, భారీకేడ్లు , ట్రాఫిక్ నియంత్రణ భద్రత పరమైన ఏర్పాట్లును పరిశీలించారు. సభా ప్రాంతంలో విఐపి లు మరియు పబ్లిక్ కు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు..

ఈనెల 14న, గురువారం రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. మంత్రి పర్యటనపై బుధవారం కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానం ద్వారా మధ్యాహ్నం 2.50 గంటలకు శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గాన బత్తలపల్లి లోని ఆర్ డి టి హాస్పిటల్ లో జరిగే కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా భద్రత ,ట్రాఫిక్ నియంత్రణ , కాన్వాయ్ మార్గం, విధులు నిర్వహించే సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాన , డీఎస్పీలు నరసింగప్ప, శివన్నారాయణస్వామి, కేవీ మహేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బిసి ఐ వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్ఐలు మరియు సంబంధిత సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.

Tags:District SP Reviews Security Arrangements Ahead of State Chief Minister and Union Minister’s Visit