పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఎన్‌ఎస్.పేటలో నివాసం ఉన్న చంద్రావతి అనే మహిళ తన భర్త గిరీష్ వరకట్న వేదింపులు తాళలేక మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రమణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎన్‌ఎస్.పేటలో ఉన్న గిరీష్ కు 2013లో చంద్రావతిని ఇచ్చి వివాహం చేశారు. కట్నకానుకల క్రింద పదితులాల బంగారం, రూ.5 లక్షల నగదు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా ఉండగా అత్త పద్మావతమ్మ, మామ కృష్ణమూర్తి, ఆడబిడ్డ భార్గవి, ఆమె స్నేహితురాలు జయంతి కలసి అదనపు కట్నం ఇవ్వాలని, లేకపోతే ఆస్తి ఇవ్వాలని చంద్రావతిని ప్రతిరోజు కొట్టడం, చంపేస్తామని బెదిరించడం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొనట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు అందరిపైన కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Tags: Dowry case registered