అమరావతి ముచ్చట్లు:
ఏపీలోని 8 జిల్లాల్లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ (FRA) పట్టాదారులకు 100% రాయితీపై బిందు, 90% రాయితీతో తుంపర సేద్యం పరికరాలను అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ‘ధర్తీ ఆబా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ కింద అల్లూరి, మన్యం, నంద్యాల, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, ఏలూరు, పల్నాడు ఎనిమిది జిల్లాల్లోని 2.30 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. గిరిజన ప్రాంతాల్లో
వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Tags: The Coalition Government Stands by Tribal Farmers in AP.