May 13, 2026
Explore
కూటమి ప్రభుత్వంపై నిరసన

కూటమి ప్రభుత్వంపై నిరసన

May 13, 2026 | Andhra Pradesh

హిందూపురం ముచ్చట్లు:

కర్నూలు సిటీ వైఎస్ఆర్సిపి యువజన విభాగం అధ్యక్షుడు “బాలు” పై ఈ కూటమి ప్రభుత్వం కక్షగట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అతని పై అక్రమ కేసులు బనాయిస్తూ, అతన్ని చాలా మనోవేదనకు గురిచేసిన సందర్భంగా, ఆ వేధింపులు తాళలేక బాలు నిన్నటి రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన దుశ్చర్యను నిరసిస్తూ హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద, నియోజకవర్గ ఇంచార్జ్ “కురుబ దీపిక వేణు” సారథ్యంలో, మరియు యువజన విభాగం అధ్యక్షుడు మనోజ్ జూలియట్ (మింటూ) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి, పోలీసుల వైఖరి నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివిస్టుల పై రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు బనాయించి వారికి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ, మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, రాబోవు రోజుల్లో ప్రజలే దీనికి తగిన బుద్ధి చెబుతారని, మీరు నేడు నాటిన విత్తనం రేపు చెట్టుగా మారి అది మీకే రివర్స్ తగులుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags: Protest against the coalition government